యాప్నగరం

త్వరలో జగన్‌వి రెండు కుంభకోణాలు బయటపెడతా.. ఆధారాలు ఉన్నాయి: లోకేష్

TDP Mahanaduలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన నారా లోకేష్. రెండు కుంభకోణాలు బయటపెడతానంటున్నారు. జగన్ దావోస్ పర్యటనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 May 2022, 9:01 pm

ప్రధానాంశాలు:

  • జగన్ స్కామ్‌ బయటపెడతానన్న లోకేష్
  • పొత్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
  • పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనా స్పందించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మహానాడులో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించి కుంభకోణాలను బయటపెడతానని చెప్పారు. ఈ కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని.. అన్ని బయటపెడతానన్నారు. అదానీ, అరబిందో, గ్రీన్కో సంస్థలతో ఒప్పందానికి దావోస్ వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. తాడేపల్లి కొంపకు పిలిస్తే వాళ్లే వస్తారు.. అదానీ, గ్రీన్కోలను గతంలో వెళ్లగొట్టారు.. మళ్లీ వాళ్లతో సెటిల్ చేసుకున్నాక ఒప్పందాలు కుదిరాయని ఆరోపించారు.
సీఎం జగన్ నైజం ప్రజలకు వివరిస్తా.. పార్టీ ఆదేశిస్తే పాదయాత్రే కాదు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు లోకేష్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దమేనన్నారు. జగన్ సొంత పార్టీ కార్యకర్తలను గాలికొదిలేశారని.. ప్రతిపక్షాలను, ప్రజలను హింసించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడర్‌ను కూడా హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు వచ్చాయన్నారు.

పొత్తుల అంశంపైనా లోకేష్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని.. ప్రజలంతా కలిసి ప్రజా కంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే అందరూ కలవాలనే ఉద్దేశంతో పవన్, చంద్రబాబు వ్యాఖ్యానించారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తామన్నారు. మహానాడుకు స్పందన పీక్స్‌లో ఉందని.. యువత అంటే వారసులు మాత్రమే కాదు.. పార్టీ కోసం పని చేసిన యువకులు కూడా ఉన్నారన్నారు. చంద్రబాబు చెప్పినట్లు 40శాతం సీట్ల కేటాయింపుల్లో వారసులతో పాటు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని యువత కూడా ఉంటారని సంకేతాలు ఇచ్చారు.

అంతేకాదు పార్టీకి సంబంధించి వరుసగా మూడుసార్లు ఓడితే వారికి టికెట్స్ లేవన్నారు నారా లోకేష్ (Nara Lokesh). వచ్చేసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటాను అన్నారు. ఏళ్ల తరబడి పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుందని.. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ యాక్టివ్ కాలేదన్నారు. ప్రజల్లో లేని వారికి, పనిచేయని వారికి ఇంఛార్జ్ పదువులు ఉండవన్నారు. ఈ అంశాలపై పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించినట్లు చెప్పారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.