యాప్నగరం

ప్రకాశం జిల్లా: పింఛన్ సొమ్ములో దొంగనోట్ల వ్యవహారంలో ట్విస్ట్.. పోలీసులు ఆరా తీస్తే!

Yerragondapalem Fake Currency In Pension కలకలంరేపింది. ఆదివారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసిన వాలంటీర్. పింఛన్ తీసుకున్నవారిలో కొందరు నకిలీ నోట్లను గుర్తించారు. వెంటనే అధికారులకుస సమాచారం అందించారు. అప్పటి వరకు పంపిణీ చేసిన నోట్లను చూస్తే ఏకంగా 38 నోట్లు నకిలీగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీవో.. నకిలీ నోట్లు ఎలా వచ్చాయో ఆరా తీస్తున్న పోలీసులు. బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు చెబుతున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Jan 2023, 9:50 am

ప్రధానాంశాలు:

  • యర్రగొండపాలెంలో నకిిలీ నోట్లు
  • పింఛన్ డబ్బుల్లో గుర్తించారు
  • రూ.500 38 నోట్లు ఉన్నాయి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yerragondapalem Fake Currency In Pension
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దొంగనోట్ల కలకలం రేపాయి. ప్రభుత్వం అందజేసే సామాజిక పింఛన్ల సొమ్ములో ఫేక్ కరెన్సీ కనిపించింది. ఈ విషయాన్ని గుర్తించిన పింఛన్ దారులు చెప్పడంతో గుర్తించారు. మొత్తం 38 దొంగ నోట్లు ఉన్నాయి.. అన్నీ 500 రూపాయల నోట్లేనని వాలంటీర్ చెబుతున్నారు. పింఛన్‌ల పంపిణీ కోసం యర్రగొండపాలెం బ్యాంక్‌లో డబ్బుల్ని నరసాయపాలెం పంచాయతీ కార్యదర్శి డ్రా చేసుకుని వచ్చారు.
నరసాయపాలెంలో ఎప్పటిలాగే నగదు డ్రా చేసి ఎస్సీ కాలనీకి చెందిన వాలంటీరు ఎం.ఆమోస్‌కు తెచ్చి ఇచ్చారు. ఆదివారంనాడు ఆమోస్‌ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఈ క్రమంలో పింఛను అందుకున్న మహిళ రూతమ్మ రూ.500 నోట్లు మూడింటిని నకిలీవిగా గుర్తించారు. ఆమె అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమై అధికారులు.. అప్పటివరకు పంచిన నగదును లబ్ధిదారుల దగ్గర పరిశీలించారు.

వాలంటీర్ పంపిణీ చేసిన డబ్బుల్లో రూ.500 నోట్లలో 38 నకిలీవిగా తేలాయి. ఈ దొంగ నోట్లప వ్యవహారంపై ఎంపీడీవో రంగసుబ్బరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత బుకాయించిన వాలంటీరు.. అధికారులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం అంగీకరించాడు. అధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. ఆమోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఆరా తీస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.