యాప్నగరం

ప్రకాశం: కన్నకూతురిపై కామం.. 5 నెలల గర్భవతిని చేసి.. నీచం

కన్నకూతురిపై నీచానికి ఒడిగట్టాడో కసాయి తండ్రి. తల్లి లేని సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూతురు గర్భానికి కారణమెవరో తెలిసి కుటుంబ సభ్యులు హతాశులయ్యారు.

Samayam Telugu 15 Jul 2021, 10:02 pm
రోజురోజుకీ ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోడ్డుపైకి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకూ భయపడాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. కామాంధులను ఉరికొయ్యకి వేలాడదీసినా కనీస భయం కలగడం లేదు. కామంతో రగిలిపోతూ కాలనాగులా కాటేస్తున్నారు. వావీవరసలు మరచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి ఏపీలో చోటుచేసుకుంది.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురిని చెరబట్టాడో నీచుడు. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసిన దారుణ ఘటన వివరాలు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
girl raped


బెస్తవారిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య, పిల్లలతో కలసి ఊరికి దూరంగా ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. గత జనవరిలో సరుకులు తెచ్చేందుకు భార్య సమీపంలోని ఊరికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కూతురిపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగట్టాడు. తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి పలుమార్లు బెదిరించి కూతురిపై అఘాయిత్యం చేస్తున్నాడు. ఇటీవల కూతురుని విపరీతంగా కొడుతుండడంతో ఆమె డయల్ 100కి కాల్ చేసింది. పోలీసులు తండ్రిని మందలించి వచ్చేశారు. ఆ తర్వాత అవ్వ, తాతల వద్దకు వెళ్లిన బాలిక తండ్రి కీచకపర్వాన్ని ఏకరువు పెట్టింది. అప్పటికే బాలిక ఐదు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. కీచక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.