యాప్నగరం

ఒంగోలు: నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏమైందంటే

Ongole Balakrishna Helicopter Emergency Landing అయ్యింది. శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలయ్య హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చారు. శనివారం ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్‌ బయల్దేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ఒంగోలు పీటీసీ మైదానంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చేవరకు హెలికాప్టర్ బయలుదేరే పరిస్థితి అక్కడ లేదు. దీంతో బాలయ్య ఇంకా ఒంగోలులోనే ఉన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Jan 2023, 11:31 am

ప్రధానాంశాలు:

  • బాలయ్య హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • వాతావరణం అనుకూలించకపోవంతోనే
  • మంచు కురుస్తుండటంతో క్లియరెన్స్ లేదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Balakrishna Helicopter Emergency Landing
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఒంగోలులో నిర్వహించిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం బాలయ్య, హీరోయిన్ శ్రుతిహాసన్ ఇతరులతో కలిసి శుక్రవారం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. రాత్రికి ఒంగోలులోనే బసచేసిన బాలకృష్ణ శుక్రవారం ఉదయం అదే హెలికాప్టర్‌‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.
అయితే హెలికాప్టర్‌ బయల్దేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణం కష్టమన్న భావనతో పైలట్లు ఒంగోలు పీటీసీ మైదానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చేవరకు హెలికాప్టర్ బయలుదేరే పరిస్థితి కనిపించడం లేదు. బాలయ్య హెలికాప్టర్ సేఫ్‌గా ల్యాండ్ అయిందని తెలుసుకుని ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.