యాప్నగరం

ఒంగోలు: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళా డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత

ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఓ యువ మహిళా డాక్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కు మెరుగైన వైద్యం కోసం..!

Samayam Telugu 27 Jan 2021, 4:42 pm
ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ యువ డాక్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ ధనలక్ష్మి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌తో పాటు స్థానిక సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నైకి తరలించారు.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న డాక్టర్‌కు అస్వస్థత


ఒంగోలు జీజీహెచ్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న ధనలక్ష్మి ఈ నెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ నెల 24 నుంచి డాక్టర్ జ్వరం బారినపడ్డారు. దీంతో జీజీహెచ్‌లో ఆమెకు చికిత్స అందించారు. కానీ, జ్వరం ఎక్కువ కావడంతో పాటు ఒక్కసారిగా ఆమెకు బీపీ తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రి సంఘమిత్రకు తరలించారు. అయితే అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే, గుంటూరులో జరుగుతున్న అంగన్ వాడీ కార్యకర్తల ధర్నాలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాధ అనే అంగన్‌వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. రెండు రోజు క్రితం రాధ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వెంటనే సహోద్యోగులు జీజీహెచ్‌కు తరలించారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.