యాప్నగరం

ఒంగోలు: ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరారీ.. అతడు హత్య కేసులో నిందితుడు!

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కరోనా రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఓ హత్య కేసులో నిందితుడైన అతడు అందరి కళ్లుగప్పి..!

Samayam Telugu 23 Apr 2021, 6:44 pm
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. రిమ్స్ రెండో అంతస్తులో ఉన్న హత్య కేసులో నిందితుడు విజయ్.. వార్డులో ఇనుప కిటికీని తొలగించి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి ఎస్కార్ట్ సిబ్బంది రూంకు బయట ఉన్న సమయంలో చాకచక్యంగా కిటికీ ఇనుప చువ్వలు తొలగించిన విజయ్.. అక్కడి నుంచి పరారయ్యాడు.
Samayam Telugu ఒంగోలు రిమ్స్


ఈ నెల 14న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు వద్ద నాగరాజు అనే ఆటో డ్రైవర్ హత్య కేసులో విజయ్, శ్రీను, విద్యాసాగర్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ నిందితులను జైలుకు తరలించే సమయంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో విజయ్, శ్రీనుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 18 నుంచి రిమ్స్‌లో విజయ్, శ్రీనుకి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు. ఈ సమయంలో అందరి కళ్లుగప్పి విజయ్ పరారయ్యాడు. నిందితుడు విజయ్‌ స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అని తెలుస్తోంది. నిందితుడు విజయ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.