యాప్నగరం

ప్రకాశం: పంట పెట్టుబడి కోసం అప్పు చేసిన రైతు.. ఎలుకలు ఎంత పనిచేశాయి, అయ్యో పాపం

Rats Bite Currency In Prakasam District ఘటన కలకలంరేపింది. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం అప్పు చేసిన పేద రైతు. ఇంట్లో ఓ పెట్టేలో డబ్బుల్ని దాచారు.. రెండు రోజుల తర్వాత నోట్లన్నీ ముక్కలు, ముక్కలు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 3 Oct 2022, 1:02 pm

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లాలో పేద రైతుకు పెద్ద కష్టం
  • అప్పుగా తెచ్చిన డబ్బులన్నీ ముక్కలు
  • ఎలుకల దెబ్బకు అన్నదాత కన్నీరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prakasam District
ప్రకాశం జిల్లాలో ఓ పేద రైతుకు పెద్ద కష్టమే వచ్చి పడింది. పంట పెట్టుబడి కోసం అప్పుగా తెచ్చుకున్న డబ్బులు ఎలుకల పాలయ్యాయి. డబ్బులు తెచ్చి ఇంట్లో పెడితే మొత్తం ముక్కలు, ముక్కలు చఏశాయి. ముండ్లమూరు మండలం పులిపాడు పంచాయతీలోని బృందావనంకు చెందిన చిరుగూరి అగస్టీన్‌ రోజు వారీ కూలి పనులు, కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతడు ఇంట్లో తిండి గింజల కోసం కొంత భూమిలో వరి సాగు చేసుకుంటున్నాడు.
ఆ పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రెండు రోజుల క్రితం రూ.70 వేలు అప్పు చేసి తీసుకొచ్చాడు. ఆ డబ్బుల్ని ఇంట్లో గోడకు అమర్చిన చిన్న చెక్క పెట్టెలో పెట్టారు. చెక్కపెట్టెలో ఉన్న డబ్బును భార్యను తీసుకు రమ్మని చెప్పాడు.. తాళం తీసి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. ఆ కరెన్సీ మొత్తం ముక్కలు ముక్కలుగా కనిపించాయి. ఆ చినిగిపోయిన ముక్కలనే తీసుకెళ్లి భర్తకు చూపించింది.
చెక్క పెట్టె వెనుక గోడకు రంధ్రం ఏర్పడటంతో ఎలుకలు వచ్చి డబ్బుల్ని కొరికేశాయని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రూ.70వేలు ఎలుకలు కొరికేశాయని.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. పంటి పెట్టుబడికి డబ్బులు లేవని.. తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బు ఇలా ముక్కలు ముక్కలు కావడంతో.. తన కోడలికి ప్రసవం దగ్గర పడుతుండడంతో ఏమి చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.