యాప్నగరం

Yanam: నాన్న తెచ్చిన డ్రెస్ నచ్చలేదని కూతురి ఆత్మహత్య.. షాకింగ్

తండ్రి తీసుకొచ్చిన బట్టలు నచ్చలేదని కూతురు గొడవకు దిగడంతో తండ్రి మందలించాడు. చిన్న విషయానికే క్షణికావేశానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 2 Jan 2021, 5:27 pm
స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని.. బట్టలు తీసుకురాలేదని.. చిన్నచిన్న కారణాలకు టీనేజ్ యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అలాంటి ఘటన యానాంలో జరిగింది. తండ్రి తీసుకొచ్చిన డ్రెస్ నచ్చలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. మెట్టకుర్రులోని ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన టీనేజ్ యువతి(16) పదో తరగతి చదువుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె తండ్రి బట్టలు కొనుక్కొచ్చాడు. అయితే అవి తనకు నచ్చలేదని కూతురు గొడవపడడంతో తీవ్రంగా మందలించాడు. క్షణికావేశానికి లోనైన యువతి అఘాయిత్యానికి పాల్పడింది. తల్లిదండ్రులు భోజనం చేస్తున్న సమయంలో ఆమె ఇంటిపైకి వెళ్లి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.