యాప్నగరం

తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు.. సీఎం జగన్ పెద్ద మనసు, నిమిషాల్లోనే!

Rajahmundry Couple Suicide ఘటన. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన జగన్ సర్కార్. ఇద్దరికి చెరో రూ.5లక్షల చొప్పున అందించాలని సూచించారు. ఆదేశాలు జారీ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Sep 2022, 1:33 pm

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajahmundry Couple Suicide
ఆన్‌లైన్‌ లోన్‌ యాప్ నిర్వాహకుల వేధింపులతో రాజమండ్రి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘట గురించి తెలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి, లిఖితలకు చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవీలతకి సూచించారు.
అలాగే లోన్‌ యాప్‌ల ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే కఠిన చర్యలకు ఆదేశించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. లోన్ యాప్‌లపై ఉక్కుపాదం తప్పదని సంకేతాలు పంపారు. రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. లోన్ యాప్ వేధింపులతో విషం తాగి చనిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలిచింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.