యాప్నగరం

Tanuku: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. ఒక్కసారిగా..

Tanuku: ఏపీ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తణుకులోని నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకలు జరిగిన ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Mar 2023, 1:46 pm

ప్రధానాంశాలు:

  • శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
  • దువ్వ గ్రామంలోని వేడుకల్లో గందరగోళం
  • అగ్నికి ఆహుతి అయిన చలువ పందిళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chaos in Sri Rama Navami
శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దువ్వ (Duvva village) లోని వేణుగోపాల స్వామివారి ఆలయంలో .. శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఇందు కోసం ఆలయంలో చలువ పందిళ్లు వేశారు. ఇక్కడ సీతారాముల వారి కల్యాణం జరుగుతుండగా.. చలువ పందిళ్లపై ఒక్కసారిగా పటాకులు వచ్చి పడ్డాయి. దీంతో పందిరికి మంటలు అంటుకున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భక్తులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో.. ఎవరీకి ఏటువంటి గాయాలు కాకపోవడంతో.. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
పుత్తూరులో జరిగిన శ్రీరామనవమిలో.. సీతారాముల వారికి మంత్రి రోజా (RK Roja) దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వేటినగరం రోడ్‌లోని మండపం నుంచి కాలినడకన వెళ్లి.. సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ కోదండరామస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి, ఉత్సవ కమిటీ సభ్యులు రోజా దంపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో పూజారులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించి.. మంత్రి రోజా-సెల్వమణి దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. కోదండ రామస్వామి వారి ఆలయంలో గురువారం నుంచి 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని కోరారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.