యాప్నగరం

పాస్టర్ గలీజు పని.. బాలికను పాకలోకి తీసుకెళ్లి చేతిలో రూ.50 పెట్టి...

కాకినాడలో కీచక పాస్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలికను పాకలోకి తీసుకెళ్లిన పాస్టర్ గంగాధర్ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలక వేయడంతో రూ.50 ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు.

Samayam Telugu 6 Jul 2021, 4:38 pm
భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు బోధించాల్సిన పాస్టర్ కీచకుడిగా మారాడు. మాయమాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ గ్రామీణ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కలవాల గంగాధర్‌ అలియాస్‌ సుధాకర్‌ అనే స్థానికంగా ఓ చర్చిని ఏర్పాటుచేసుకుని పాస్టర్‌‌గా వ్యవహరిస్తున్నాడు.
Samayam Telugu Image


గత నెల 28న పదేళ్ల వయస్సున్న చిన్నారికి మాయమాటలు చెప్పి చర్చికి దూరంగా ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో చేతిలో రూ.50 పెట్టి ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించి పారిపోయాడు. ఈ సంఘటనపై గ్రామపెద్దలు జోక్యం చేసుకుని బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఈ నెల 4వ తేదీన సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కీచక పాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.