యాప్నగరం

తూ.గో జిల్లా: అమ్మాయి నన్ను మోసం చేసింది.. యువకుడి ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్!

శంకరరావు అనే యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ప్రేమపేరుతో తన దగ్గర నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

Samayam Telugu 29 Jan 2022, 11:13 am

ప్రధానాంశాలు:

  • తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో ఘటన
  • ప్రేమ పేరుతో డబ్బు, బంగారం తీసుకుందని ఆరోపణ
  • తనను మోసం చేసిందంటూ సెల్ఫ వీడియో తీశాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తూ.గో జిల్లా
తూర్పుగోదావరి జిల్లాలో అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంకు చెందిన కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ప్రేమపేరుతో తన దగ్గర నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదనను తెలియజేశాడు.
వీడియో వాట్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానని చెప్పుకొచ్చాడు. కొద్దిసేపటికే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే ఈ యువకుడికి పెళ్లి కాగా భార్యాభర్తలు విడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు పెట్టిన వీడియోలు, ఫోటోల ఆధారంగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.