యాప్నగరం

మేనమామతో పెళ్లి.. ఏడోరోజే నవవధువు ఆత్మహత్య

మేనమామతో వివాహమైన యువతి వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 6 Jul 2021, 6:47 am

ప్రధానాంశాలు:

  • తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
  • పెళ్లయిన ఏడోరోజే వధువు ఆత్మహత్య
  • విషాదంలో రెండు కుటుంబాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భర్తతో అశ్వినీ స్వాతి(ఫైల్ ఫోటో)
కాళ్లకు రాసిన పారాణి ఇంకా ఆరలేదు.. తోరణాలు వాడలేదు.. ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది... అయితే ఏం జరిగిందో తెలీదు గానీ సరిగ్గా పెళ్లయిన ఏడో రోజే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో కలిసి ఏడడుగులు వేసిన ఏడు రోజులకే జీవితానికి ముగింపు పలికింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగింది.

సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో జూన్ 29న వివాహం జరిగింది. రెండు రోజుల కిందట వధూవరులు గాదరాడ వచ్చారు. ఆషాఢమాసం వస్తుండటం, సోమవారం మంచిరోజు కావడంతో.. సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపడానికి సిద్ధం చేశారు. ఆమెను తిరిగి పుట్టింటికి పంపేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లలో మునిగిన వేళ స్వాతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమెకు అశోక్‌ మేనమామ వరస అవుతాడు. తాపీ పని చేసే అతడు ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక స్వాతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలాడు. దగ్గర బంధువులే కావడంతో స్వాతి మృతి విషయం బయటకు రాకుండా ఇరు కుటుంబాల వారు రాజీ అయ్యారు. అయితే బంధువుల్లో ఓ వ్యక్తి 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహానికి తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించారు. స్వాతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందీ అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.