యాప్నగరం

అల్లూరి జిల్లా: ధాన్యం బస్తా బయటకు తీసిన రైతు.. చూడగానే గుండె ఆగినంత పనైంది!

ఓ రైతు ధాన్యం బస్తాను బయటకు తీశాడు.. అందులో చూడగానే భయంతో వణికిపోయాడు. లోపలి నుంచి కొండచిలువ బయటకు రావడంతో అవాక్కయ్యాడు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘటన.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Sep 2022, 9:20 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kunavaram Python
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ రైతుకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పెదార్కూరుకు చెందిన పాయం కన్నయ్య ఇంట్లో ఉంచిన ధాన్యం బస్తాలను బయటకు తీయడానికి వెళ్లాడు. ఓ బస్తా తీయగానే అందులో కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన రైతుకు గుండె ఆగినంత పనైంది.. భయంతో వణికిపోయిన కన్నయ్య వెంటనే స్థానికులు, తోటి రైతులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారంతా అక్కడికి వచ్చారు.
స్థానికులు అందరు కలిసి కొండచిలువను బస్తాలో నుంచి బయటకు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కొండచిలువను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కొండచిలువ ధాన్యం బస్తాల్లోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రైతు చూడబట్టి సరిపోయింది కానీ.. ఒకవేళ కొండచిలువ ఇంట్లోకి చొరబడి ఉంటే పరిస్థితి ఏంటని తలచుకుని భయపడ్డారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.