యాప్నగరం

రాజమండ్రి: పాస్టర్‌ మోసం చేశాడని యువతి ఫిర్యాదు.. అండగా నటి కరాటే కళ్యాణి

Karate Kalyani: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పాస్టర్ తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు సినీ నటి కరాటే కళ్యాణి అండగా నిలిచింది.

Samayam Telugu 23 Feb 2021, 11:35 pm
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సహాయంతో బాధితురాలు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పొలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్‌తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చేది. అక్కడి పాస్టర్‌ ఎన్‌జే షరోన్‌ కుమార్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని బాధిత యువతి ఆరోపించారు. ఆ తర్వాత ముఖం చాటేశాడని, గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని.. బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
Samayam Telugu బాధితురాలితో కరాటే కళ్యాణి


తనకు తండ్రి లేడని, అందుకే భయపడి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు యువతి పేర్కొంది. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని చెప్పారు. దీంతో యువతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోషి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.