యాప్నగరం

Online Games: తాత ఆపరేషన్ కోసం డబ్బు పంపిస్తే.. ఆన్‌లైన్ గేమ్‌ ఆడాడు.. చివరికి..

Online Games: స్మార్ట్ ఫోన్.. వ్యసనంలా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరుగుతున్న ఘటనలు. తాజాగా.. ఆన్‌లైన్‌ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. కోనసీమకు చెందిన యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. వేలాది రూపాయలు నష్టపోయాడు. భయంతో.. సూసైడ్ చేసుకున్నాడు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 6 Jun 2023, 2:08 pm

ప్రధానాంశాలు:

  • కోనసీమ జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌కి యువకుడు బలి
  • ఆన్‌లైన్ గేమ్‌లో రూ.78 వేలు పోగొట్టుకున్న సాధ్విక్
  • తాత ఆపరేషన్ కోసం డబ్బులు పంపిన మేనత్త
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Online Games
ఆన్‌లైన్‌ గేమ్స్
Online Games: కోనసీమ జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌కి యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ ఆడి సాధ్విక్ అనే యువకుడు రూ.78 వేలు పోగొట్టుకున్నాడు. తన తాత ఆపరేషన్ కోసం దుబాయ్ నుంచి సాధ్విక్ మేనత్త డబ్బులు పంపింది. మేనత్త పంపిన డబ్బులతో సాధ్విక్ ఆన్‌లైన్ గేమ్ (Online Games) ఆడాడు. ఆమె పంపిన డబ్బులు మొత్తం పోయాయి. దీంతో ఇంట్లో తెలిస్తే మందలిస్తారని సాధ్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాధ్విక్ సూసైడ్‌తో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కేవలం సాధ్విక్ ఒక్కడే కాదు.. వందలాది మంది యువకులు ఈ ఆన్ లైన్ గేమ్స్ కారణంగా తనువు చాలిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిపోయే దశ నుంచి.. ఆ ఆటలకు బానిసలుగా మారే పరిస్థితి వస్తోంది. ప్రపంచానికంతా కీడు తలపెట్టిన కరోనా.. ఆన్‌లైన్‌ గేమ్‌లకు మాత్రం మంచే చేసింది. మహమ్మారి, లాక్‌డౌన్‌ వల్ల.. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు, ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనివార్యం కావడంతో.. స్మార్ట్‌ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంటర్నెట్‌ డేటా ప్లాన్‌లు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలే 'ఆన్‌లైన్‌ గేమింగ్‌ బూమ్‌'ను సృష్టించాయి.
ఏప్రిల్‌ 2020లో మన దేశంలో 783 మిలియన్ల గేమింగ్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ అయ్యాయి. ఇది ప్రపంచంలోని మొత్తం డౌన్‌లోడ్స్‌లో 16.6 శాతం. ఈ పరిణామంతో భారతదేశం గేమింగ్‌ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్కెట్‌గా ఎదగబోతోందని ప్రపంచం గుర్తించింది. దీంతో విద్యార్థులు, యువతి ఈ ఆన్‌లైన్ గేమ్స్ వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.