యాప్నగరం

నా బ్లడ్ బాయిల్ అవుతోంది.. ఆ ట్వీట్‌పై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

సభాపతిగా తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని.. కానీ ఆ ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది. తాము ట్వీట్‌లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదన్నారు.

Samayam Telugu 16 Apr 2021, 7:48 am

ప్రధానాంశాలు:

  • అచ్చెన్నాయుడిపై మండిపడ్డ తమ్మినేని సీతారాం
  • తిరుపతి ప్రచారంలో రాయి ఎలా వచ్చిందో చెప్పాలి
  • అచ్చెన్నాయుడే 17 తర్వాత టీడీపీ లేదన్నారుగా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తమ్మినేని
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. ఈ నెల 17తర్వాత టీడీపీ లేదు డాష్ లేదు అని ఆయన అన్నదే కదా.. తిరుపతి ప్రచారంలో రాయితో కొట్టారంటున్నారు.. ఆ రాయి ఎక్కడినుంచి వచ్చిందో ఆలోచన చేయాలి కదా అన్నారు. సభాపతిగా తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని.. కానీ అచ్చెన్నాయుడి ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అన్నారు. స్పీకర్ వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ తీరుపై మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారన్నారు తమ్మినేని. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయని.. అవన్నీ పట్టించుకోనవసరం లేదన్నారు. తాము ట్వీట్‌లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదని.. అవినీతి లేని,పారదర్శకత కలిగిన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి రెండేళ్లయ్యిందని.. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎక్కడైనా పైసా అవినీతి చేశారని చెప్పే దమ్ము ప్రతిపక్షానికి ఉందా.. ఇదే తన ఓపెన్ ఛాలెంజ్ అంటూ సవాల్ విసిరారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.