యాప్నగరం

ఈ నాయకులకో దండం, పదవికి రాజీనామా చేస్తా.. వైసీపీ ప్లీనరీ నుంచి వెళ్లిపోయిన మున్సిపల్ ఛైర్మన్

పలాస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహించారు. అయితే మున్సిపల్ ఛైర్మన్ గిరిబాబు తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లీనరీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Jul 2022, 8:56 am

ప్రధానాంశాలు:

  • వైఎస్సార్‌సీపీ నేతల తీరుపై మున్సిపల్ ఛైర్మన్ ఆగ్రహం
  • అవమానించారంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు
  • అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానన్న గిరిబాబు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. పలాసలో గురువారం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. అలాగే, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. అయితే, అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని మిగిలిన వారంతా దిగువన కూర్చోవాలని ఆహ్వానం పలికిన పార్టీ పలాస మండల అధ్యక్షుడు పైల వెంకటరావు. ప్లీనరీ వేదికపైకి గిరిబాబును ఆహ్వానించలేదు.
మున్సిపల్‌ ఛైర్మన్‌ బి.గిరిబాబు కార్యకర్తల మధ్యలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత గిరిబాబు వేదిక పైకి వచ్చి మాట్లాడాలని పైల వెంకటరావు పలు మార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు. దీంతో గిరిబాబుతో పాటు, ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైకి గిరిబాబును ఆహ్వానించకుండా ఆయన్ని అవమానించారని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఆ వెంటనే గిరిబాబు సమావేశం నుంచి వెనుదిరిగారు. అయితే, గిరిబాబును ఆపేందుకు స్థానిక వైసీపీ నాయకులు ప్రయత్నించినా ఇక జరిగిన అవమానాలు చాలని.. ఈ నాయకులకో దండం.. అవసరమైతే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన అనుచరులు సైతం ప్లీనరీ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.