యాప్నగరం

శ్రీకాకుళం: ఖాళీ స్థలంలో పురాతన ఆనవాళ్లు.. చాలా అరుదు, పెద్ద చరిత్రే ఉంది

మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించినట్లు చెప్పారు. ఆ ఆనవాళ్లు క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు.

Samayam Telugu 11 Mar 2021, 12:21 pm

ప్రధానాంశాలు:

  • రాజ్యంపేటలో నవీన శిలాయుగ ఆనవాళ్లు
  • ఆదిమానవుడి ఆనవాళ్లుగా గుర్తింపు
  • ధ్రువీకరించిన ఆర్కియాలజీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో పురాతన ఆనవాళ్లు బయటపడ్డాయి. రాజాం మండల పరిధి రాజయ్యపేటలో నవీన శిలాయుగ ఆనవాళ్లు లభించాయి. ఈ విషయాన్ని రాజాం రచయితల వేదిక నిర్వాహకులు గార రంగనాథం చెప్పారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా రాజయ్యపేట వెళ్లగా.. అక్కడ మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించినట్లు చెప్పారు. ఆ ఆనవాళ్లు క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు.
ఆదిమానవుడు ఆధునికుడయ్యే క్రమంలో రాతి బండలమీద, కొండలమీద నల్ల శానపు రాళ్లను అరగదీసి పనిముట్లుగా మార్చుకునేవాడని రంగనాథం తెలిపారు. ఆ విధంగా ఏర్పడినవే ఆ రాతి గోతులని.. ఈ విషయాన్ని విజయవాడ ఆర్కియాలజీ సాంకేతిక నిపుణులను సంప్రదించి ధ్రువీకరించామని ఆయన తెలిపారు. రాజాంలో పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు. ఈ ప్రాంతంలో మరికొన్ని ఆనవాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.