యాప్నగరం

తిరుమల శ్రీవారి చెల్లెలి జాతరకు అంతా రెడీ.. 900 ఏళ్ల చరిత్ర, ప్రత్యేకతలివే

Tirupati Gangamma Jatara 2023 వెంకన్న చెల్లెలు గంగమ్మ జాతరకు అంతా సిద్ధమైంది. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరకు ఏకంగా 900 ఏళ్ల చరిత్ర ఉంది. ఏపీతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది కూడా భక్తులు భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. భక్తులు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 May 2023, 1:33 pm

ప్రధానాంశాలు:

  • తిరుపతి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం
  • రాష్ట్ర పండుగగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం
  • 9 రోజుల పాటూ కొనసాగనున్న జాతర
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Tataiahgunta Gangamma Jatara: రాయలసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే జనజాతర తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా వైశాఖ మాసం చివరి వారంలో ప్రారంభమయ్యే గంగమ్మ జాతర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతర జరిగే తొమ్మిది రోజూలూ భక్తులు గంగమ్మను రోజుకో వేషంలో దర్శించుకుంటారు.
మంగళవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కులస్థులు చాటింపుతో... గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కట్టారు. రాత్రి 7 గంటలకు గంగమ్మ పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను గ్రామపెద్ద తీసుకువస్తారు. వీటిని ఆలయం తరఫున కైకాల కులస్థులు అందుకుంటారు. ఈ సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు.

గంగమ్మ జాతరను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండుగగా గుర్తించింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో..జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. . టీటీడీ. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, పలు సంస్థల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మకు టీటీడీ నుంచి సారె అందుతుంది. అంతేకాదు అమ్మవారు స్త్రీలను కాపాడటానికి వచ్చినప్పుడు వేసిన వేషాలు, ఆచార వ్యవహారాలను భక్తులు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

వారం రోజుల పాటు గంగమ్మ జాతరలో రోజుకో విచిత్ర వేషధారణలతో భక్తులు కనిపిస్తారు.. మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఏపీతో పాటూ పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు కూడా ఈ జాతరకు వస్తారు.. అమ్మవారికి సారె, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మే 9న పుట్టింటి సారె, చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది.. ఈ నెల 17న ఉదయం విశ్వరూప దర్శనం, చెంప నరకడంతో జాతర ముగియనుంది. ఈ ఏడాది కూడా భక్తులు భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.