యాప్నగరం

High Court: 'భక్తుల భావోద్వేగాలతో వ్యాపారమా ?'.. టీటీడీపై ఏపీ హైకోర్టు ఫైర్

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జారీ, భక్తులకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ (TTD) అవలంభిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. కరోనా సాకుగా చూపించి 14 ఏళ్ల క్రితం బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని చెప్పింది. గతంలో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పిస్తే.. ఎలాంటి ఆదాయం రాదన్న భావనలో టీటీడి ఉన్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యనించింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 25 Sep 2022, 8:47 am
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జారీ, భక్తులకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ (TTD) అవలంభిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. కరోనా సాకుగా చూపించి 14 ఏళ్ల క్రితం బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని చెప్పింది. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్జిత సేవ టికెట్లు (TTD Online Tickets) బుక్‌ చేసుకోవడానికి కొత్తవారికి అవకాశం కల్పిస్తూ.. టీటీడీ భారీగా నగదు వసూలు చేస్తోందని గుర్తుచేసింది. గతంలో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పిస్తే.. ఎలాంటి ఆదాయం రాదన్న భావనలో టీటీడి ఉన్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యనించింది.
Samayam Telugu AP High court new.
టీటీడీపై ఏపీ హైకోర్టు ఫైర్


టీటీడీ తీరు భక్తుల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవటమే లక్ష్యంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా టికెట్లు రద్దు అయినవారికి సర్దుబాటు చేయలేమనే వాదన సరికాదని అభిప్రాయపడింది. 14 ఏళ్ల క్రితం నగదు కట్టించుకొని ఇప్పుడు తిరిగి చెల్లిస్తామనటం అనైతికమంది. నిర్దేశించిన తేదీల్లో స్వామివారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుందని పిటిషనర్లకు ఆశ కల్పించారని.., ఆ హామీకి కట్టుబడాలని టీటీడీని ఆదేశించింది. పిటిషనర్లకు టీటీడీ పంపిన లేఖలను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

కేసు నేపథ్యం ఏంటంటే..
విశాఖపట్నంకు (Visakapatnam) చెందిన ఆర్‌. ప్రభాకరరావు తిరుమల శ్రీవారి వస్త్రాలంకరణ సేవ (మేల్‌చాట్‌ వస్త్రం) కోసం 2007 జూలై 9న ఆన్‌లైన్‌ ద్వారా ఈ-టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. 2021 డిసెంబరు 17న ఆ సేవలో పాల్గొనేందుకు ప్రభాకర్ రావుకు అవకాశం లభించింది. అయితే కరోనా కారణంగా వస్త్రాలంకరణ సేవను రద్దు చేస్తున్నట్లు ఆయనకు డిసెంబరు 7న టీటీడీ లేఖ రాసింది. దానికి ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందాలని లేదా టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా సేవ కోసం చెల్లించిన మొత్తం తిరిగి పొందవచ్చునని లేఖలో పేర్కొంది.

అయితే తమకు కేటాయించిన సేవను వినియోగించుకొనేందుకు మరో తేదీ ఖరారు చేయాలని ప్రభాకర్ రావు అభ్యర్థించారు. టీటీడీ నుంచి స్పందన లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వివిధ ఆర్జిత సేవ టికెట్లు పొంది రద్దు అయిన మరో ముగ్గురు కూడా హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.