యాప్నగరం

జగన్‌ హెచ్చరిక.. మంత్రి పదవి ఊడినట్టే.! డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

మంత్రి పదవులు ఇచ్చే సమయంలోనే సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. అవసరం ఉంటేనే రెండున్నరేళ్ల తర్వాత పదవిలో ఉంటారు.. లేకపోతే మంత్రి పదవి ఊడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Jul 2021, 4:47 pm
మంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్‌ వద్ద మార్కులు వేయించుకుంటేనే పదవి నిలుస్తుందని.. లేకుంటే పదవి పోయినట్టేనని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చుంటే కుదరదని.. కష్టపడి పనిచేసి సీఎం జగన్ వద్ద మార్కులు సంపాదించుకోవాలన్నారు. అందులో తేడా వస్తే మంత్రి పదవి ఊడిపోతుందని నారాయణ స్వామి అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ys jagan


అధినేత జగన్ ఆ విషయం ముందే చెప్పారని.. మంత్రి పదవులు ఇచ్చే సమయంలోనే స్పష్టంగా చెప్పారని నారాయణ స్వామి అన్నారు. మీ అవసరం ఉంటేనే రెండున్నరేళ్ల తర్వాత పదవిలో ఉంటారని.. లేకుంటే పదవి పోతుందని అప్పుడే హెచ్చరించారని మంత్రి అన్నారు. తన వరకు తాను నిజాయితీగా కష్టపడి పని చేశానని నారాయణ స్వామి అన్నారు. తనకు జగన్ వద్ద మంచి మార్కులు వచ్చాయని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మంచి మార్కులొచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తేడా వస్తే మంత్రి పదవి ఊడుతుందంటూ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.