యాప్నగరం

చేపలు పట్టేందుకు గుంతలో దిగితే.. పైకి లేచిన శవం.. మృతదేహం ఎవరిదో తెలుసుకుని షాక్..!!

Samayam Telugu 27 Nov 2021, 6:16 pm
వరదలకు ఊర్లన్నీ ఏర్లయ్యాయి.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కడపడితే అక్కడ వరద నీరే.. ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతుండటంతో.. వరదల్లో కొట్టుకొచ్చిన శవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలానే తిరుపతిలో చేపలు పట్టడానికి వెళ్లిన కొందరికి బురదలో చిక్కుకుపోయిన ఒక శవం కనిపించింది.. ఆ శవాన్ని వారం రోజుల కిందట గల్లంతైన వ్యక్తిగా తెలుసుకుని స్థానికులు షాక్‌కు గురయ్యారు.
Samayam Telugu మృతదేహాన్ని తీసుకెళ్తున్న పోలీస్ సిబ్బంది


తిరుపతి లక్ష్మీపురానికి చెందిన సుబ్బారావు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వారం రోజుల కిందట పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా లక్ష్మీపురం కూడలి వద్ద వరద నీటి కాల్వలో గల్లంతయ్యాడు. అయితే అప్పటి నుంచి సుబ్బారావు కోసం కుటుం సభ్యులు తిరగని చోటు లేదు.. అన్ని చెరువులు, వరద ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేదు.

ఈ క్రమంలోనే.. శనివారం కొరమేని గుంట వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన కొంత మందికి బురదగుంతలో ఒక మృతదేహం కనిపించింది. శవాన్ని బయటకు తీద్దామని వెళ్తుంటే.. అక్కడ దిగబడిపోతోంది బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో.. జేసీబీ సహాయంతో అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసి వరదల్లో గల్లంతైన సుబ్బారావుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించడంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. సుబ్బారావు మృతదేహాన్ని ఆ పరిస్థితిలో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.