యాప్నగరం

తిరుమలలో భారీ నాగుపాము.. పొడవు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలోని విద్యుత్‌శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. ఆ పామును చూసి గుండె ఆగినంత పనైంది. వెంటనే తేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Samayam Telugu 2 Jan 2021, 7:22 am
తిరుమలలో భారీ నాగుపాము కలకలంరేపింది. జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలోని విద్యుత్‌శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. వెంటనే పామును గుర్తించిన సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఉద్యోగి భాస్కర్‌నాయుడు.. విద్యుత్‌శాఖ భవనంలో ఉన్న భారీ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని శేషాచల అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచి పెట్టారు. ఆ భారీ సర్పం పొడవు ఏకంగా ఏడు అడుగుల పొడవు ఉంది. అటవీ ప్రాంతంలో నుంచి తప్పించుకుని వచ్చింది.
Samayam Telugu తిరుమల


ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలంరేపింది. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయపడ్డారు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.