యాప్నగరం

Tirumala: తిరుమలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి క్రేజ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ యువకులు

Tirumala: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఏపీలో పరిచయం అక్కర్లేని పేరిది. ముఖ్యంగా యువతలో ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనతో ఫొటోలు దిగేందుకు యువత ఎగబడతారు. తాజాగా.. తిరుమలలోనూ సిద్ధార్థ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువకులు ఎగబడ్డారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 26 Jan 2023, 12:38 pm

ప్రధానాంశాలు:

  • శ్రీవారిని దర్శించుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
  • తిరుమలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి క్రేజ్
  • సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ యువకులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Youth selfies with Siddhartha Reddy
సిద్ధార్థ రెడ్డితో యువకులు సెల్ఫీలు
Tirumala: వైఎస్సార్సీపీ యువజన విభాగం చీఫ్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం సిద్ధార్థ రెడ్డి బయటకు రాగా.. ఆయన్ను చూసిన యువకులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆయన కూడా ఒపిగ్గా అందరితో ఫొటోలు దిగారు. Byreddy Siddharth Reddy ఫోన్ పట్టుకొని సెల్ఫీలకు ఫోజులిచ్చారు. దీంతో యువకులు ఖుషీగా ఫీలయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని స్టేట్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమించారు. దాదాపు ఏడాది క్రితం సీఎం జగన్.. సిద్దార్థ్ రెడ్డిని శాప్ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను రహస్యంగా కలిశారనే ప్రచారం జరిగింది. కానీ.. ఈ ప్రచారాన్ని సిద్ధార్థ రెడ్డి ఖండించారు. తాజాగా.. బైరెడ్డిపై నమ్మకం ఉంచుతూ.. జగన్ (YS Jagan) ఆయనకు యువజన విభాగం బాధ్యతలు కట్టబెట్టడం గమనార్హం.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.