యాప్నగరం

ఏపీ: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం.. వాట్సాప్‌లో ప్రత్యక్షం, అధికారుల క్లారిటీ!

Ap 10th Paper Leak వదంతులతో కలకలంరేగింది. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈ లీకేజీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. లీక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Apr 2022, 1:06 pm

ప్రధానాంశాలు:

  • పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్‌లో పేపర్ ప్రత్యక్షం
  • వెంటనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు
  • విద్యార్థులు ఎవరూ వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ వదంతులు వచ్చాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. తెలుగు కాంపోజిట్ పేపర్ చిత్తూరు జిల్లాలో కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం అయ్యింది. ఉదయం 9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్ష ప్రారంభమైతే.. 9గంటల57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్‌లో కనిపించింది. ఈ విషయం తెలియడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
అధికారులు వెంటనే పేపర్ లీక్ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రంను ఎవరో కావాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారని డీఈవో అంటున్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కలెక్టర్ హరినారాయణన్ ఈ పేపర్ లీక్ వ్యవహారంపై స్పందించారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. విద్యార్థులు చక్కగా పరీక్ష రాస్తున్నారన్నారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈవోకు సమాచారం వచ్చిందని.. వెంటనే ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థులు ఎవరూ వదంతులు నమ్మొద్దన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.