యాప్నగరం

చిత్తూరు: నడిరోడ్డుపై ఏనుగు విగతజీవిగా.. షాకింగ్!

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ఏనుగు కంటైనర్ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే..

Samayam Telugu 16 Jan 2021, 7:08 pm
చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో జాతీయ రహాదారిపై కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందింది. కృష్ణగిరి – సూలగిరి జాతీయ రహదారిపై నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగును వేగంగా వచ్చిన భారీ కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడి కింద పడిపోయింది. రోడ్డుపైనే గిలగిలా కొట్టుకుంటూ కొంత సేపటికి ఏనుగు కన్నుమూసింది. ఏనుగు మృతితో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Samayam Telugu రోడ్డుపై మృతి చెందిన ఏనుగు


కాగా, ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, పుత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. రాత్రిపూట పలు చోట్ల పంటలను సైతం నాశనం చేస్తున్నాయి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు ఏనుగుల దాడిలో మృతి చెందిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలా, ఏనుగులు యథేచ్ఛగా జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా, కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఏనుగుల సంచారంపై దృష్టిసారించాలని అటవీ శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.