యాప్నగరం

చిత్తూరు: అనుమానాస్పదంగా కనిపించిన కారు.. పోలీసులు తనిఖీ చేస్తే అసలు గుట్టురట్టు

కుప్పం రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ కారును ఆపారు.. లోపల తనిఖీ చేశారు.

Samayam Telugu 20 Jan 2021, 10:41 am
చిత్తూరు జిల్లాలో గంజాయి కలకలంరేపింది. వీ కోట సమీపంలో.. కుప్పం రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ కారును ఆపారు.. లోపల తనిఖీ చేస్తే ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారి దగ్గర 60 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు గంజాయిని తమిళనాడులోని క్రిష్ణగిరికి తరలిస్తున్నారని తేలింది. క్రిష్ణగిరికి చెందిన నరసింహులు, ముదిరాజ్‌, సయ్యద్‌ వసీమ్‌లను అరెస్టు చేసి.. ఆ కారును సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడు వెళుతుండగా పోలీసులకు దొరికిపోయారు.
Samayam Telugu chittoor police seized ganja packets and two arrested
చిత్తూరు: అనుమానాస్పదంగా కనిపించిన కారు.. పోలీసులు తనిఖీ చేస్తే అసలు గుట్టురట్టు


ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం, గంజాయి రవాణా కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఎస్ఈబీ అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడే తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది అడ్డంగా దొరికిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోనే ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.