యాప్నగరం

చిత్తూరు: ఈ పాములకు భారీ డిమాండ్.. అడవిలోకి వెళ్లి పట్టుకొచ్చారు, తీరా అమ్మేసే సమయంలో!

Chittoor Red Sand Boa పాముల్ని అమ్మేసే ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అటవీ ప్రాంతం నుంచి పాముల్ని పట్టుకొచ్చి అమ్మేస్తున్నారు.. వీరిలొ 9మందిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Mar 2023, 9:59 am

ప్రధానాంశాలు:

  • రెండు తలల పాములు అమ్మే గ్యాంగ్
  • 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • డబ్బులు, రెండు పాములు, కార్లు సీజ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hyderabad Red Sand Boa
రెండు తలల పాముల విక్రయించే ముఠా ఆట కట్టించారు పోలీసులు. ట్రావెల్స్‌ వ్యాపారం చేసుకుంటున్న మాణిక్‌రెడ్డి జ్యోతినగర్‌లో ఉంటున్నారు. అతడు రెండు తలల పాములు కావాలని చిత్తూరుకు చెందిన నవీన్‌, భాస్కర్‌, చంద్రశేఖర్‌, గోపాల్‌, ప్రసాద్‌, యుగంధర్‌లకు ఫోన్‌లో చెప్పాడు. వాటిని తెచ్చిస్తే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో నమ్మారు.. వాటిని నల్లమల అడవుల్లోంచి మాణిక్‌రెడ్డి ఇంటికి తెచ్చారు.
ఆ పాముల వీడియోను తీసి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన రమేష్‌, విజయ్ కుమార్, మహమ్మద్‌ భాషా, సికిందర్‌ షేక్‌, రాఘవేందర్‌‌లకు పంపారు. ఈ గ్యాంగ్ పాముల్ని కొనుగోలు చేయడానికి గురువారం మాణిక్‌రెడ్డి ఇంటికి రావడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల్లో యుగంధర్‌, గోపాల్‌, ప్రసాద్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని 9 మందిని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు కార్లు, లక్షా 90 వేలు నగదు, రెండు పాములు, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.