యాప్నగరం

అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య.. పెళ్లి జరగాల్సిన రోజే ఘోరం!

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఆగిపోవడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది.

Samayam Telugu 4 Mar 2021, 10:22 pm

ప్రధానాంశాలు:

  • చిత్తూరు జిల్లాలో విషాదం
  • పెళ్లి పీటలు ఎక్కాల్సిన రోజే యువతి ఆత్మహత్య
  • అమెరికాలోని డల్లాస్‌లో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chittoor sushma.
చిత్తూరుకు చెందిన ఓ యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుష్మా.. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అమెరికాలోనే నివాసం ఉంటున్న ఆమె సోదరుడు.. చిత్తూరు పోలీసుల కాలనీలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు సుష్మా మరణవార్తను చేరవేశారు.
పూతలపట్టుకు చెందిన ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడితో సుష్మా వివాహం కుదిరింది. అతడు కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నాడు. కానీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక.. వరుడి కుటుంబీకులు వివాహాన్ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

పెళ్లి ఆగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన సుష్మ.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన రోజే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో వరుడి కుటుంబీకులపై సుష్మా కుటుంబీకులు, బంధువులు ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సుష్మ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.