యాప్నగరం

చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం.. క్లారిటీ ఇచ్చిన చిత్తూరు జిల్లా ఎస్పీ

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు-టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగి.. లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. అటు చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. దానిపై చిత్తూరు జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 5 Jan 2023, 5:33 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబును అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం
  • ప్రచారంపై స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ
  • బూటకపు వార్తలను నమ్మవద్దని ఎస్పీ సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Naidu
కుప్పంలో చంద్రబాబు నాయుడు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రోడ్లపై ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించొద్దు. కానీ.. చంద్రబాబు మాత్రం రోడ్లపైనే మాట్లాడుతున్నారు. పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించినందుకు చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని.. గురువారం ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఏ క్షణమైనా చంద్రబాబును అదుపులోకి తీసుకోవచ్చనే Social Media పోస్టులు గుప్పుమన్నాయి.
ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా ఎస్పీ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 'మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుప్పంలో ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల్లో.. ఎటువంటి నిజం లేదు. ఇలాంటి బూటకపు వార్తలను నమ్మవద్దు. నారా చంద్రబాబు నాయుడు యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు' అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. దీంతో ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.