యాప్నగరం

చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త..

మదనపల్లె నుంచి చెర్లోపల్లె (తిరుపతి) వరకు 103 కిలోమీటర్ల రహదారిలో తొలిదశగా రూ.1,474.54కోట్ల అంచనా వ్యయంతో మదనపల్లె–పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు.

Samayam Telugu 16 Oct 2021, 1:30 pm

ప్రధానాంశాలు:

  • చిత్తూరు జిల్లావాసులకు శుభవార్త
  • తిరుపతి-మదనపల్లె ఫోర్ లేన్ రోడ్డు
  • టెండర్లకు ఎన్‌హెచ్‌ఏఐకు ఆహ్వానం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లావాసులకు శుభవార్త. తిరుపతి– మదనపల్లె ఫోర్‌లేన్‌ రోడ్డుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమై ఎన్‌హెచ్‌–71 నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో ప్రక్రియ ప్రారంభమైంది. మదనపల్లె నుంచి చెర్లోపల్లె (తిరుపతి) వరకు 103 కిలోమీటర్ల రహదారిలో తొలిదశగా రూ.1,474.54కోట్ల అంచనా వ్యయంతో మదనపల్లె–పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు.
ఎన్‌హెచ్‌ఏఐ పోర్టల్‌లో ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో డిసెంబర్‌ 13 లోపు ఈ–టెండర్లు దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్‌ 14న టెండర్లను ఖరారు చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రోడ్డు నిర్మాణం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. డిజైన్, బిల్డ్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఓటీ) విధానంలో రహదారి నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. ఫోర్‌లేన్‌ రోడ్డు మంజూరుకు చొరవ చూపిన ఎంపీ మిథున్‌రెడ్డికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.