యాప్నగరం

Tirumala: ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు: రమణ దీక్షితులు

Tirumala: తిరుమలలో అధికారుల తీరుపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని ఆరోపించారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 29 Jan 2023, 5:03 pm

ప్రధానాంశాలు:

  • మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రమణ దీక్షితులు
  • ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని ఆవేదన
  • వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని ఆరోపణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ramana Dikshitulu
రమణ దీక్షితులు
Tirumala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. టీటీడీ అధికారుల తీరుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని.. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని Ramana Dikshitulu అసహనం వ్యక్తం చేశారు. సొంత ప్రణాళిక ప్రకారమే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమలలో ధనికులైన భక్తులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. రమణ దీక్షితులు ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన పలు ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ.. 30/87 యాక్ట్‌తో వీరిని తొలగించారని.. తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.