యాప్నగరం

చంద్రబాబుపై కుప్పంలో పోటీ.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్

Vishal Kuppam నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో నేరుగా ఆయనే స్పందించారు.. ట్విట్టర్ వేదికగా కుప్పం నుంచి పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Jul 2022, 6:03 am

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో విశాల్‌పై వార్తలు
  • ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో
  • కుప్పం నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విశాల్
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)పై కుప్పం (Kuppam) నుంచి హీరో విశాల్ (Hero VIshal) పోటీ చేస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ కావడంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే ప్రచారం జరుగుతోందని.. వాటన్నింటినీ ఖండిస్తున్నాను అన్నారు. రాజకీయాలకు సంబంధించి తాను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదని.. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అన్నారు.
తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. కుప్పం నుంచి తాను బరిలో లేనని విశాల్ చెప్పడంతో ఈ ప్రచారానికి తెరపడింది. విశాల్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. ఈ భారీ యాక్షన్‌ మూవీ కాగా.. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే విశాల్ వైఎస్సార్‌సీపీ తరపున కుప్పం నుంచి బరిలోకి దిగుతారని వస్తున్న వార్తల్ని అటు వైఎస్సార్‌సీపీ కూడా ఖండించింది. కుప్పం నుంచి నూటికి నూరుశాతం భరత్ అభ్యర్థిగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని ధీమానున వ్యక్తం చేస్తోంది. విశాల్ పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి కుప్పం పొలిటికల్ హైడ్రామాకు ఇలా తెరపడింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.