యాప్నగరం

జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త.. తిరుపతిలో జనసేన వినూత్న ప్రచారం

CM Jagan mohan ఒంగోలు పర్యటనకు అర్ధరాత్రి ప్రయాణికుల కారును అధికారులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం తిరుపతి పర్యటనకు రానున్న నేపథ్యంలో.. జనసేన నేతలు వినూత్నంగా ప్రచారం చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 May 2022, 1:55 pm
సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి విచ్చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ ముఖ్య నాయకులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం స్థానిక బైరాగి పట్టెడ పార్క్ వద్ద 'జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త..' అంటూ ప్రచారం చేశారు.
Samayam Telugu తిరుపతిలో జనసేన నాయకుల నిరసన


ఈ సందర్భంగా తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి విచ్చేస్తున్నారని.. సీఎం కాన్వాయ్‌కి సంబంధించి ఏ ఒక్క ట్రాన్స్ పోర్ట్ వారు కూడా అందుబాటులో లేరని అన్నారు. ఇప్పటికే ట్రావెల్స్ వారికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నందువలన ఎవ్వరు కూడా కార్లు పెట్టేందుకు సుముఖంగా లేరని చెప్పారు. తిరుపతి స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్న భక్తులు ఎవరి వారి కార్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటనకు అర్ధరాత్రి ప్రయాణికుల కారును అధికారులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో.. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన నేతలు కార్లు జాగ్రత్త అంటూ అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.