యాప్నగరం

డిప్యూటీ సీఎం ఇలాకాలో 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి'.. జనసేన వెరైటీ ధర్నా

Palasamudram: చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. పాలసముద్రం మండలంలో అధ్వాన రోడ్ల పరిస్థితిపై బురద నీటిలో పొర్లుదండాలు పెడుతూ.. ఆందోళన నిర్వహించారు.

Samayam Telugu 21 Oct 2021, 8:49 pm
రాష్ట్రంలో ఓ వైపు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. మరోవైపు చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. అధ్వాన రోడ్ల పరిస్థితిపై బురద నీటిలో దిగి ఆందోళన నిర్వహించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధన నెల్లూరు నియోజకర్గ పరిధిలో పాలసముద్రం మండలంలో ప్రయాణికుల ఇబ్బందులను వివరించారు.
Samayam Telugu జనసేన నాయకులు నిరసన


పాలసముద్ర మండల కేంద్రంలో అడుగో గుంత.. గజానికో గొయ్యితో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు అన్నారు. నాయకులు, పాలకులకు పదవుల మీద ఉన్న మోజు.. ప్రజల మీద లేదని మండిపడ్డారు. పాలసముద్రం నుంచి అనేక ప్రాంతాలకు వాహనాలు వెళుతుంటాయని.. వేలాది మంది ప్రజలు బెంగుళూరుకు ప్రయాణిస్తుంటారని అన్నారు. ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోకుండా.. ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరేత్తిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా బురద నీటిలో పొర్లుదండాలు పెడుతూ.. జై జనసేన అంటూ నినదాలు చేశారు. పదవిని కాపాడుకునేందుకు చూపే శ్రద్ధ సొంత నియోజకవర్గ ప్రజలపై ఉపముఖ్యమంత్రికి ఏమాత్రం లేదంటూ జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. పాలకులు తమకు చేతకాదని చెబితే.. తామే రోడ్లు నిర్మిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.