యాప్నగరం

TTDకి ముంబై భక్తుడి భారీ విరాళం.. రూ.300 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో తిరుపతిలో రూ.300 కోట్లతో చిన్న పిల్లల హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించారు. కాగా ఈ హాస్పిటల్ నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముంబైకి చెందిన వ్యాపారవేత్త ముందుకొచ్చారు.

Samayam Telugu 12 Mar 2021, 6:34 pm
ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు టీటీడీకి భారీ విరాళం ప్రకటించాడు. టీటీడీ నిర్మించబోయే చిన్న పిల్లల హాస్పిటల్‌ కోసం రూ.300 కోట్ల ఖర్చును తన ఫౌండేషన్ ద్వారా భరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి కిమ్స్ ఆవరణలో 300 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాదిలో టీటీడీ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం బోర్డు సమావేశంలో.. నూతన హాస్పిటల్ నిర్మాణం విషయమై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
Samayam Telugu TTD
Tirumala Tirupati Devasthanams


తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిన్న పిల్లల హాస్పిటల్ నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. సీఎం జగన్ సూచనల మేరకు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో చిన్న పిల్లల హాస్పిటల్‌ల నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ సూచించారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.