యాప్నగరం

Tirupati: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ బ్రో.. 'పుష్ప' కంటే టాలెంటెడ్‌గా ఉన్నావ్!

Tirupati: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి అధికారులు కొత్త కొత్త ప్లాన్‌లు అమలు చేస్తున్నారు. కానీ.. స్మగ్లర్లు వీరికి మించి ఆలోచిస్తున్నారు. సరికొత్త టెక్నిక్‌లతో పోలీసులు, ఫారెస్టు అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను బార్డర్ దాటిస్తున్నారు. దుంగలు ఉంటే పోలీసులు గుర్తిస్తున్నారని.. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ కొత్త ప్లాన్ అమలు చేశాడు. కానీ.. మన పోలీస్‌లతో మామూలుగా ఉండదుగా.. అందుకే ఆ స్మగ్లర్లకు చెక్ పెట్టారు. స్మగ్లర్ల బండారం బయట పెట్టారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 6 Jun 2023, 7:38 pm

ప్రధానాంశాలు:

  • ఎర్రచందనం స్మగ్లింగ్‌కు కొత్త దారులు
  • పొడి చేసి బార్డర్ దాటిస్తున్న స్మగ్లర్లు
  • పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sandalwood Smuggling
ఎర్రచందనం స్మగ్లింగ్
Tirupati: తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. యర్రావారిపాళెం మండలం బోడెవాండ్లపల్లె సమీపంలో.. సాయికాడ గుట్టు వద్ద ఎర్రచందనం (Red Sandal) చెక్కలు, పొడి, ముక్కలను లారీలో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు, ఒక లారీ స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. పట్టుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వివరించారు.
ఈ తరహా స్మగ్లింగ్ (Smuggling in Pushpa style) ఇదే మొదటి సారి అని డీఎస్పీ యశ్వంత్ చెప్పారు. పట్టుబడిన స్మగ్లర్లలో తమిళనాడుకు చెందిన మహమ్మద్ రసూల్, కార్తీక్, భాస్కరన్ జేసురాజ్‌లతో పాటు అన్నమయ్య జిల్లా సిద్దారెడ్డిపల్లికి చెందిన తిరుమల శెట్టి నాగరాజు, వీరబల్లికి మండలానికి చెందిన అమరేంద్ర రాజు ఉన్నట్టు వెల్లడించారు. మహమ్మద్ రసూల్‌పై ఇప్పటికే 25 కేసులు ఉన్నాయని.. పీడీ యాక్ట్ కూడా నమోదైందని డీఎస్పీ వెల్లడించారు. పట్టుబడ్డ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో.. ఢిల్లీలో ఉన్న ఇద్దరు బడా వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.