యాప్నగరం

తిరుమల: మళ్లీ తెరపైకి వెయ్యికాళ్ల మండపం.. రమణ దీక్షితులు ఆసక్తికర ట్వీట్

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. ఆసక్తికర ట్వీట్ చేసిన దీక్షితులు.

Samayam Telugu 8 Jan 2021, 10:45 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఓ విన్నపం చేశారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ళ మండపం మళ్లీ నిర్మించాలని దీక్షితులు కోరారు. ఈ మేరకు సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ళ మండపాన్ని పునర్‌నిర్మిస్తే శ్రీవారి భక్తులు సంతోషిస్తారన్నారు. దేవాలయాలు తిరిగి నిర్మాణం చేపట్టిన శుభసమయంలో సీఎం జగన్‌కు శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రమణదీక్షితులు ట్వీట్ చేశారు.
Samayam Telugu తిరుమల

రమణ దీక్షితులు వెయ్యికాళ్ల మండపాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆ మండపాన్ని తిరిగి నిర్మించాలని ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్‌కు విన్నవించడం ఆసక్తికరంగా మారింది. ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.