యాప్నగరం

28న తిరుమలలో రథసప్తమి వేడుకలు, ఘనంగా ఏర్పాట్లు.. వివరాలివే!

తిరుమలలో ఈ నెల 28న రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. తిరుమలలో రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 19 Jan 2023, 10:35 pm
సూర్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ మేరకు తిరుమలలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Samayam Telugu తిరుమల రథసప్తమి (ఫైల్ ఫొటో)


సూర్య జయంతి సందర్భంగా శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

వాహన సేవల వివరాలు..
• ఈ నెల 28న ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) సూర్యప్రభ వాహనం.

• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.

• ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.

• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం.

• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.

• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం.

• సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం.

• రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.