యాప్నగరం

CJI: తిరుమల వెంకన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల విచ్చేశారు. ఆయనకు పాలకవర్గం, అధికారులు ఘనస్వాగతం పలికారు. రాత్రి సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

Samayam Telugu 10 Jun 2021, 10:42 pm
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల విచ్చేశారు. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అలిపిరి మార్గం నుంచి తిరుమల చేరుకున్నారు. విరామ సమయంలో ఆయన వెంకన్నను దర్శించుకున్నారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు వెంట ఉన్నారు.
Samayam Telugu శ్రీవారి ఆలయంలో జస్టిస్ ఎన్వీ రమణ
cji


తిరుచానూరు నుంచి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకి పాలకవర్గం, అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి లలిత కుమారి, టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో స్వాగతం పలికారు. జిల్లా న్యాయమూర్తులు, అనంతపురం డీఐజీ కాంతి రాణా టాటా, కలెక్టర్ హరినారాయణన్, సీవీఎస్వో గోపీనాథ్, తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు సీజేఐకి స్వాగతం పలికారు.

cji


tirumala



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.