యాప్నగరం

తిరుమలలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య.. స్నేహితులతో వచ్చి!

Tirumala Vikarabad Youth Suicide వికారాబాద్ నుంచి తిరుమలకు స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు. తిరుమల జీఎన్‌సీ దగ్గర అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ప్లాస్టిక్ నీటి పైపుతో ఉరి వేసుకుని చనిపోయాడు. చనిపోయిన యువకుడు ఇంట్లో కుటుంబసభ్యులతో గొడవపడినట్లు చెబుతున్నారు. వారిపై అలకతో తిరుమల వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలో అతడు ప్రాణాలు తీసుకోవడం కలకలంరేపుతోంది. పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడితో పాటూ వచ్చిన స్నేహితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 May 2023, 1:13 pm

ప్రధానాంశాలు:

  • తిరుమలలో వికారాబాద్ యువకుడి ఆత్మహత్య
  • అటవీప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు
  • స్నేహితులతో కలిసి తిరుమల వచ్చిన యువకుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Telangana Youth Suicide
తిరుమలలో తెలంగాణకు చెందిన యువకుడి ఆత్మహత్య కలకలంరేపింది. తెలంగాణ వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌‌కు చెందిన భగవంత్‌రెడ్డి కుమారుడు నరేష్‌రెడ్డి మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవపడ్డాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి తిరుమలకు వచ్చాడు. అతడు జీఎన్‌సీ దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్టుకు ప్లాస్టిక్‌ నీటిపైపుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని ఆచూకీ కోసం ప్రయత్నించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అతని దగ్గర ఉన్న కీప్యాడ్‌ ఫోన్‌ ఆధారంగా వివరాలు తెలిశాయి.. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడితో పాటు వచ్చినవారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. వారిని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలిస్తాయంటున్నారు. మృతదేహాన్ని తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల కాలంలో తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. గతవారం తిరుమలలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర హోటల్‌లో పనిచేసే ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. సతీష్‌రెడ్డి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పద్మనాభం అనే మరో వ్యక్తిపై కత్తులలో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. ఈ ఘటనలతో పద్మనాభంగా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసినవారిలో ప్రధాని నిందితుడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతున్నారు.

తిరుమలలో శుక్రవారం నాడు వేద విద్యార్థిపై కత్తితో దాడి కలకలంరేపింది. తిరుమల H.T కాంప్లెక్స్‌లో.. షర్ట్ కొనుగోలు విషయంలో రమేష్ అనే వ్యక్తితో వేద విద్యార్థి వాగ్వాదానికి దిగాడు. ఆ కోపంతో వేద విద్యార్థిపై రమేష్ కత్తితో దాడి చేశాడు.. గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా తిరుమలలో మహిళ ఆత్మహత్య కలకలంరేపింది. వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మరుగుదొడ్డిలో విజయవాడకు చెందిన మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తిరుమలలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన తెలంగాణ భక్తుడు ఆలయంలో ఆనంద నిలయం వీడియోను సమీపం నుంచి మొబైల్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత వీడియో వైరల్ కాగా.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలంరేపుతున్నాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.