యాప్నగరం

తిరుమల: అలిపిరి నడకదారిలో దొంగల కలకలం.. భయంతో భక్తుల పరుగులు

బంగారాన్ని దోచుకోవడానికి దుండగులు యత్నించారని కర్నూలుకు చెందిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడక మార్గంలో 2,830వ మెట్టు దగ్గర ఘటన జరిగినట్లు చెబుతున్నారు.

Samayam Telugu 18 Jan 2021, 10:05 am
తిరుమల అలిపిరి నడకదారిలో భక్తుల్ని దొంగలు వెంబడించడం కలకలంరేపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నగడక మార్గంలో వెళ్లుతండగా తమ వద్ద ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి దుండగులు యత్నించారని కర్నూలుకు చెందిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడక మార్గంలో 2,830వ మెట్టు దగ్గర ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దొంగల నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టామని.. ఆదివారం రాత్రి 11గంటలకు డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి భక్తులను కాపాడారు. నడక మార్గంలో దొంగలు కనిపించడంతో భక్తులు భయపడుతున్నారు. ఈ ఘటనపై టీటీడీ, విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దొంగల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu తిరుమల


కొద్ది రొోజుల క్రితం తిరుమల కాటేజీలలో దొంగతనం కలకలంరేపింది.GNC విభాగంలోని 527 E, F గదుల్లో దొంగలు గురువారం (జనవరి 7) చోరీకి పాల్పడ్డారు. గదికి వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. 527F గదిలో రూ.46 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. 527E గదిని పొందిన భక్తులు ఆ సమయంలో అక్కడ అందుబాటులో లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు ఆ గదిని పరిశీలించలేదు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన భక్తులు శ్రీవారి దర్శన నిమిత్తం తిరుమలకు వచ్చారు. 527F గదిలో బస చేశారు. వీరు వెంకన్న దర్శనానికి వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.