యాప్నగరం

తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. వీళ్లను అస్సలు నమ్మొద్దు, నిండా మంచేస్తారు

Tirumala Darshan టికెట్ల పేరుతో భక్తులకు దళారుల టోకరా. నమ్మి మోసపోతున్న బాధితులు.. తాజాగా మరో ఇద్దరు మోసపోయారు. విజిలెన్స్‌కు ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 19 Aug 2022, 8:36 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Darshan Tickets Cheating
తిరుమలలో దళారులు, కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో భక్తుల్ని మోసం చేస్తున్నారు. తాజాగా దర్శన అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులపై కేసు నమోదు చేశారు. భక్తుడు మోహన్‌గుప్తాకు ఆరు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తామని తిరుపతికి చెందిన దళారీ రాజు చెప్పాడు. మోహన్ దగ్గర రూ.86,500 వసూలు చేశాడు.. ఆ తర్వాత దర్శన టికెట్లు ఇవ్వకపోవడంతో ఆయన టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపై రాజుపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేయనున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన భక్తుడు కిరణ్‌దేశ్‌ పాండేకు శ్రీవారి సుప్రభాతసేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి పెనుమూరుకు చెందిన దళారి పవన్‌కుమార్‌రెడ్డి రూ.8వేలు వసూలు చేశాడు. టికెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి ఆయన ఫిర్యాదు చేశారు. ఇలా తిరుమలలో దర్శన టికెట్ల పేరుతో భక్తుల్ని మోసం చేస్తున్నారు.

ఇటీవల శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్‌ కూడా దొరికిపోయాడు. మల్లిఖార్జున్ కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తున్నాడు. అతడితో పాటూ మరో నలుగురిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మల్లిఖార్జున్ కొన్నేళ్లుగా శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు గతంలో కొంతమంది మధ్యవర్తుల్ని, దళారుల్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.