యాప్నగరం

తిరుమల శ్రీవారి సన్నిధిలో వైభవంగా వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేసవి నేపథ్యంలో ప్రతి సారి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ!

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Apr 2023, 12:03 am
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా పిలుస్తారు.
Samayam Telugu తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్ ఫొటో)


ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను కూడా తిరుమల శ్రీవారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే ప‌లు ర‌కాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు.

4న స్వర్ణ రథోత్సవంవసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 5వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.