యాప్నగరం

Pushpa టైప్‌లో స్మగ్లింగ్.. అంతా రహస్యంగా.. పోలీసులు సడెన్ ఎంట్రీతో..!

Chennai నుంచి విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు.. అందులో దాచి ఉంచిన..

Samayam Telugu 18 Dec 2021, 2:50 pm

ప్రధానాంశాలు:

  • చెన్నై గోడౌన్‌లలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు
  • 170 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
  • ఒకరి అరెస్ట్.. పరారీలో గోడౌన్ కీపర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం
పుష్ప మూవీలో ఎర్రచందనం చెన్నైకు తరలించి.. అక్కడి నుంచి పోర్ట్ ద్వారా విదేశాలకు తరలిస్తారు. సేమ్ ఇదే టైప్‌‌లో విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని గోడౌన్‌కు తరలించి.. అక్కడ నుంచి పోర్ట్ ద్వారా విదేశాలకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 170 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ వస్తువుల గోడౌన్‌లో రహస్యంగా ఉంచిన దుంగలను చాకచక్యంగా కనుగొన్నారు.
తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం కరకంబాడీ సమీపంలో అత్తిమాను చర్లబేస్ క్యాంప్ వద్ద ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, కేవీబీపురానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని నుంచి అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం సీఐ వెంకట రవి, ఆర్ఐ (ఏఆర్) సురేష్ కుమార్ రెడ్డి, టీమ్ చెన్నె సమీపంలోని పొన్నెరి తాలూకా విచూరులో ఓ గోడౌన్‌పై దాడి చేసినట్లు చెప్పారు.



అయితే గోడౌన్‌లో స్క్రాప్‌తో నింపి ఉంచారని, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, దాచి ఉంచిన దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ తెలిపారు. చెన్నై పోర్ట్‌కు దగ్గరగా గోడౌన్‌లో ఉందని, మరో రెండు రోజుల్లో విదేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 170 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని.. ఇవి 2.086 టన్నుల బరువు ఉందన్నారు.

వీటి విలువ కోటిన్నర రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గోడౌన్‌ కీపర్లు బీదా రఫీ, ఫరూక్‌లు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీరికి సహకరిస్తున్న తిరుపతి మంగళంకు చెందిన యశ్వంత్ కోసం ప్రత్యేక టీమ్‌లను పంపినట్లు తెలిపారు. ఈ కేసును సీఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.