యాప్నగరం

తిరుమల శ్రీవారి హుండీకి కళ్లు చెదిరే ఆదాయం: రికార్డ్ స్థాయిలో.. ఎన్ని రూ. కోట్లంటే!

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శనివారం భారీగా సమకూరింది. రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

Samayam Telugu 20 Dec 2020, 2:47 pm
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అన్ని నిబంధనలు తొలగించడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇస్తోంది. అయినా కూడా ప్రతి రోజూ భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని 37,370 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారికి హుండీకి శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 2. 23 కోట్ల ఆదాయం లభించింది. అలాగే శ్రీవారికి 14,858 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Samayam Telugu తిరుమల ఆలయం
tirumala temple


కరోనా ప్రభావంతో గత 4, 5 నెలలుగా స్వామివారి హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. లాక్‌ డౌన్, కరోనాతో కొన్ని నెలల పాటు తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేశారు. తర్వాత పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం బాగా పడిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటు టీటీడీ ఆంక్షలను తొలగించడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.