యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల 12 నుంచి మళ్లీ దర్శన టికెట్ల జారీ

Tirumala Ssd Darshan Tickets జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆదివారం వరకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 11తో వైకుంఠ ద్వారా దర్శనాలు పూర్తి కానున్నాయి. దీంతో మళ్లీ జనవరి 12 నుంచి టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అన్న ప్రసాదాలకు విరాళాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఒకరోజు విరాళ పథకం కింద రూ.33 లక్షలు అందించవచ్చని తెలిపారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 9 Jan 2023, 6:40 am

ప్రధానాంశాలు:

  • ఈ నెల 12 నుంచి దర్శనం టికెట్ల జారీ
  • ఈ నెల 11తో వైకుంఠ ద్వార దర్శనం పూర్తి
  • అన్న ప్రసాదాలపై టీటీడీ కీలక ప్రకటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Ssd Darshan Tokens
Tirumala Ssd Darshan Tokens తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టోకెట్లు జారీ చేస్తారు. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ కోటా ఆదివారంతో ముగిసిందని టీటీడీ తెలిపింది. ఇక జనవరి 12 నుంచి ఏ రోజు కా రోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో మునుపటిలాగానే ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడతాయని ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఆదివారం వరకు జారీ చేశారు. ఈ నెల 11తో దర్శనాలు పూర్తికానున్నాయి. అందుకే 12 నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నారు.
మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ ను శనివారం టీటీడీకి విరాళంగా అందజేసింది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్ దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఈ అంబులెన్స్‌ను వినియోగించనున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను అందించేందుకు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒకరోజు విరాళ పథకం కింద రూ.33 లక్షలు అందించవచ్చని టీటీడీ తెలియజేసింది. ఉదయం అల్పాహారం కోసం రూ.7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చని తెలియజేసింది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారని టీటీడీ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సెప్టెంబరులో టీటీడీ విడుదల చేసిన 2023వ సంవత్సరానికి సంబంధించిన 12 పేజీల క్యాలెండర్లు అయిపోయాయి. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 12 పేజీల క్యాలెండర్లను టీటీడీ 13 లక్షలు ముద్రించి సెప్టెంబరు 27 నుంచి అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిని భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారని.. ఎక్కువ డిమాండున్న ఈ క్యాలెండర్లు జనవరి ఒకటి నుంచి అందుబాటులో లేకుండా పోయాయి.

తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో ఆఫ్కాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. పూజలు నిర్వహించిన అనంతరం సుబ్బారెడ్డి ఈ అతిథిగృహం లోని 12 గదులకు సంబంధించిన తాళం చెవులను సంబంధిత అధికారులకు అందజేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.