యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళ జనవరి కోటా విడుదల

జనవరి 4 నుంచి 31 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు తమకు కావాల్సిన రోజు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Samayam Telugu 30 Dec 2020, 6:54 am
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరికి సంబంధించి దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుంచి 31 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. tirumala balaji.ap.gov.in టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు తమకు కావాల్సిన రోజు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు కొనసాగుతున్నాయి.. అందుకే ఆ మూడు రోజుల టికెట్లు ఉండవు.
Samayam Telugu తిరుమల


జనవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి, 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు, 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి, 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్‌ వర్షతిరునక్షత్రం,13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ, శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 2వ తేదీన 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.