యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆన్‌లైన్‌లో వసతి గదుల కోటా, బుక్ చేస్కోండి

Tirumala Accommodation April Month Quota విడుదలకానుంది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. తిరుపతి, తలకోనల్లో వసతి గదుల్ని కూడా ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ మేరకు భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు టీటీడీ వర్చువల్ సేవ టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఇటు ఏప్రిల్ 1 నుంచి నడక మార్గాల్లో దివ్య దర్శనం టికెట్లు జారీ చేయనున్న సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Mar 2023, 7:24 am

ప్రధానాంశాలు:

  • తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
  • ఈ నెల 29న వసతి గదుల కోటా విడుదల
  • ఆన్‌లైన్ సేవా టికెట్లను కూడా రిలీజ్ చేస్తారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Accommodation April Quota
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కొండపై వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి వసతి గదుల్ని ఈ నెల 29న 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అలాగే తిరుపతి, తలకోనలో కూడా వసతి గదుల్ని ఈ నెల 30 విడుదల చేయనున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవ (ఆన్‌లైన్), దర్శనం కోటా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన ఏప్రిల్ కోటా టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇదిలా ఉంటే టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శనం టికెట్లు జారీ చేయనుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు ఈ టికెట్లు ఇస్తారు.
మురోవైపు తిరుమలలో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 నూతన విద్యుత్‌ ధర్మ రథాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఈ బస్సుల్ని ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన రూ.18 కోట్లు విలువైన ఈ విద్యుత్‌ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ టీటీడీకి విరాళంగా అందజేసింది. ఛైర్మన్, ఈవో, జెఈవోతో కలిసి తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద ధర్మరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్‌ వాహనాల స్థానంలో దశలవారీగా విద్యుత్‌ వాహనాలు ప్రవేశపెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు 35 విద్యుత్‌ కార్లు ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ తిరుమల-తిరుపతి మధ్య 65 విద్యుత్‌ బస్సులు నడుపుతోందన్నారు.

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఒక్కో బస్సును రూ.1.80 కోట్ల ఖర్చుతో తయారు చేయించి 10 బస్సులను టిటిడికి అప్పగించిందన్నారు. తిరుమలలోని వర్క్‌షాప్‌ సమీపంలో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ బస్సులు నడిపేందుకు టిటిడి డ్రైవర్లకు ఒలెక్ట్రా సంస్థ శిక్షణ ఇస్తుందని, ఏప్రిల్‌ 15 నుండి తిరుమలలో భక్తులకు ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టీటీడీ ఛైర్మన్‌, ఈవో ఇతర అధికారులు కలిసి తిరుమలలో విద్యుత్‌ ధర్మరథాల్లో ప్రయాణించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.


రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.